పెద్దపల్లి పార్లమెంట్‌లో త్రిముఖ పోరు సాగుతోంది. గెలుపుపై ఎవరిధీమా వారు వ్యకం చేసు కుంటూ ప్రచారంలో దూసుకెళ్తు
న్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అందరూ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలే ఉన్నారు. అయినప్పటికీ అక్కడ హోరాహోరీ పోరు కొనసాగనుంది. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, బిఆర్‌ఎస్ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బిజెపి నుండి గోమాస శ్రీనివాస్ బరిలో నిలిచారు. వంశీకృష్ణ రాజకీయ కుటుంబం నుండి వచ్చినప్పటికీ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల వారితో పోల్చితే రాజకీయ అనుభవం మాత్రం తక్కువే. ప్రధాని మోడీ చేసిన అభివృద్ధ్ది కళ్ళముందే కనబడుతోందని, అందులో భాగమే ఎరువుల ఫ్యాక్టరీ అని చెప్పుకుంటూ బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ముందుకు సాగుతున్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజలతో మమేకం అవుతూనే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజవర్గంలో ప్రస్తుతంలో త్రిముఖ పోటీ కొనసాగుతుంది. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యకం చేస్తుకుంటూ ప్రచారం దూసుకెళ్త్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికలలో అధికార భరోసా ఒకరిది, సెంట్ మెంట్‌పై మరొకరు, సానుభూతి పవనాలపై ఇంకొకరు గెలుస్తామంటూ ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అందరూ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలే ఉన్నారు. ‘అధికారంలో ఉంది మా పార్టే..అందరి అండదండలతో భారీ మెజార్టీతో గెలిచి తీరుతా’నని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన రాజకీయ కుటుంబం నుండి వచ్చినప్పటికీ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల వారితో పోల్చితే రాజకీయ అనుభం మాత్రమే తక్కువే.
మాలలకే కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని ..పెద్దపల్లి సీటు మార్చి మాదిగలకు ఇవ్వాలని ఇటీవలే ధర్నా చేశారు. లేకుంటే మాదిగల ఓట్లు కాంగ్రెస్‌కు పడవని అధిష్ఠానానికి తేల్చిచెప్పారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు, వంశీ కృష్ణను అందరి సహకారంతో మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని అంటున్నారు. బిఆర్‌ఎస్ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలో నిలిచారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు. కార్మిక లీడర్ అయినా..ఈశ్వర్‌కు పెద్దపల్లి జిల్లాపై మంచి పట్టున్న ..పట్టుకొని ఉంటున్న వ్యక్తిగా పేరుంది. కోల్ బెల్డ్ ఏరియాలో అందరివాడుగా ముద్రపడిన మంచి రాజకీయ నేత..ఎవరి మనసు నొప్పించకుండా మెప్పించేవారని ఆ ప్రాంత ప్రజల్లో చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని ఆయనపై సానుభూతి పవనాలు వీస్తున్నాయని అందరి నోటా అదే మాట.
బొగ్గు గణీని ప్రాంతాలైన గోదావరిఖని, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ సెగ్మెంట్లలో కార్మిక లోకమంతా ఈశ్వర్‌కు మద్దతుగా నిలుస్తుందని, ధర్మపురిలో కూడా పూర్తిగా సానుభూతి ఉంటుందని రాజీకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకే కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, తనకు ఎంపిగా అవకాశం ఇవ్వాలని కొప్పుల ప్రచారాస్త్రంగా మలిచి ముమ్మరంగా తిరుగుతున్నారు. బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గతంలో పెద్దపల్లి పార్లమెంట్ నుండి ఆనాటి టిఆర్‌ఎస్ అభ్యరి ్థగా బరిలో నిలిచి, వివేక్‌పై ఓటమి చెందారు. తాను ఇప్పటికే ఒకసారి ఓటమి చెందానని, ఇప్పుడు తనకు అ =వకాశం కల్పించాలని ప్రజల ఓట్లు అభ్యర్థిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
‘మీరు కమలంనకు ఓటువేస్తే నేను గెలిచి …మోడీకి ఓటువేస్తా ..మోడీ మళ్ళీ ప్రధాని అవుతారు’ అని ఆయన ప్రజలకు వివరిస్తూన్నారు. అంతేకాకుండా ప్రధాని మోడీ చేసిన అభివృద్ధ్ది మన కళ్ళముందే కనబడుతోందని, అందులో భాగమే ఎరువుల ఫ్యాక్టరీ అని చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా దేశంలో మోడీ గాలీ వీస్తోందని ధీమాతో ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజలతో మమేకం అవుతూనే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్త్తూ ముందుకు సాగుతున్నారు.