Sunday, December 22, 2024

వృద్ధుడి ప్రాణం తీసిన చలిమంటలు

- Advertisement -
- Advertisement -

ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడు చలిమంటలు కాగుతుండగా నిప్పంటుకోవడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బొమ్మారెడ్డిపల్లికి చెందిన బొల్లి లచ్చయ్య(60)కు పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. చలి ఎక్కువగా పెడుతుండడంతో మంట దగ్గరు లచ్చయ్యను కుటుంబ సభ్యులు కూర్చొబెట్టారు. ఈ క్రమంలో ఆయన లుంగీకి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య కోసం అక్కడి నుంచి ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజిఎంలో చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News