Sunday, December 22, 2024

బిఆర్ ఎస్ కు బిగ్ షాక్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపి వెంకటేశ్ నేత

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కెసి వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక
హస్తం పార్టీలో చేరిన టిటిడి మాజీ సభ్యుడు మన్నె జీవన్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన పెద్దపల్లి (ఎస్సీ) లోక్‌సభ సభ్యుడు డాక్టర్ బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూ ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కెసి వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం ఆయన పార్టీలో చేరారు. కెసి వేణుగోపాల్ వెంకటేశ్ నేతకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కెసి. వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టిటిడి మాజీ సభ్యుడు మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆ జిల్లాకు చెందిన బిఆర్ ఎస్ నాయకులు రహ్మాన్, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

చేరికల అనంతరం కెసి. వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీ వెంకటేశ్ నేత, మన్నె జీవన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద ర్భంగా ఎంపి వెంకటేశ్ నేత, మన్నె జీవన్ రెడ్డిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్‌నగర్), జనంపల్లి అనిరుధ్ రెడ్డి (జడ్చర్ల), గవినోళ్ల మధుసూదన్ రెడ్డి (దేవరకద్ర), వీర్లపల్లి శంకర్ (షాద్‌నగర్), ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News