Thursday, December 26, 2024

ఎసిబి వలకి చిక్కిన పెద్దపల్లి సబ్ రిజిస్టర్

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: లంచం తీసుకుంటూ మరో అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం పట్టుపడింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ల కోసం పూదరి శ్రీనివాస్ నుంచి డబ్బులు డిమాండ్ చేశారు అధికారులు. ఇవాళ 60 వేల రూపాయలు తీసుకుంటుండగా పెద్దపల్లి సబ్ రిజిస్టర్ దేవనగిరి నిర్మల, అటెండర్ శ్రీనివాసులను ఎసిబి డిఎస్పి భద్ర ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇప్పటికే డాక్యుమెంట్ల కోసం పైసలు తీసుకున్నట్లు బాధితుడు తెలిపాడు. మరోసారి డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు అవినీతి చేపను వల విసిరి పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News