Thursday, March 20, 2025

మెదక్‌లో బస్సును ఢీకొట్టిన డిసిఎం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దశంకర్‌పేట: మెదక్ జిల్లా పెద్దశంకర్‌పేట మండలం కొలపల్లి వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బస్సును అతివేగంతో డిసిఎం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడడంతో జోగిపేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. విజయనగరం వాసులు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో శ్రీశైల నుంచి తుల్జాపూర్ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శంకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News