నంద్యాల : సీతారామాపురంలో హత్యకు గురైన వైసిపి కార్యకర్త పెద్దసుబ్బారాయుడు కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ నేడు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారని వెల్లడించారు. పెద్దసుబ్బారాయుడి భార్యపై కూడా దాడి చేశారని మండిపడ్డారు. నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారని ఆరోపించారు.
నిందితుల కాల్ డేటా చూస్తే ఎవరు చేయించారో అర్థమవుతోందని, ఈ కేసులో చంద్రబాబు, లోకేశ్ లను కూడా ముద్దాయిలుగా చేర్చాలని జగన్ డిమాండ్ చేశారు. ఏజెంటుగా కూర్చున్నందుకు హత్య చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీతారామాపురం గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని తెలిసి కూడా ఎందుకు అదనపు బలగాలను దించలేదని ప్రశ్నించారు. ఆ తర్వాత ఎస్సై సమక్షంలోనే మారణకాండకు దిగారని, నిందితులు గ్రామం వదిలి వెళ్లిపోయేవారకు వారిని పట్టుకునేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు. ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని, ఆధిపత్యం కోసం హత్యలు చేస్తున్నారని జగన్ నిందించారు.