Monday, January 20, 2025

పెద్దవాగుకు మరమ్మతులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ వానాకాలం సీజన్ లోనే రైతులకు సాగునీరు అందే విధంగా పెద్దవాగు ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపదికన పను లు చేపట్టాలని మరమ్మత్తులు కోసం అంచనాలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. తాత్కాలిక పనుల కోసం బండ్ ఫార్మేషన్ , అ ప్రోచ్ కెనాల్ పనులు కోసం మూడున్నర కోట్ల తో ఎస్టిమేట్స్ సిద్ధం చేసిన ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు. పెద్దవాగు ప్రాజెక్ట్ తాత్కాలిక మరమ్మత్తులు కోసం నిధులు మంజూరు చే యాలని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన మంత్రి తుమ్మల వినతికి మే రకు నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇ చ్చారు.

అతి భారీ వర్షం వరదల తో పెద్దవాగు ప్రాజెక్ట్ ఆనకట్ట కు గండ్లు పడగా అర టీఎంసీ నీరు ఖాళీ అయింది.ఈ సీజన్ లోనే ప్రాజెక్ట్ ఆయకట్టు కింద పంటలు సాగు కోసం తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి సాగునీరు ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి తుమ్మల స్పష్టం చే సారు.నిధులు మంజూరు చేయించే భాధ్యత తన దే అని, రైతులకు సాగు నీటి కష్టాలు రాకుండా చూడాలని కోరారు.పెద్దవాగు ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు కోసం సాయం అందించడం లో వెంటనే స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ణతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News