Monday, January 20, 2025

‘పెదకాపు-1’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు…

- Advertisement -
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్ పై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 29న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ..‘పెదకాపు-1′ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా గురించి, నా పెర్ఫార్మెన్స్ గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కథని నమ్మి కొత్త హీరోతో ఇంత గ్రాండ్ గా సినిమా నిర్మించిన మా బావగారు(మిర్యాల రవీందర్ రెడ్డి) గారికి ధన్యవాదాలు. మా డైరెక్టర్ గారు ఇంత మంచి సీన్స్ రాయడం వలనే నాలో ఇలాంటి పెర్ఫార్మెన్స్ బయటికి వచ్చింది. ఛోటా కె నాయుడు గారు చాలా బ్యూటిఫుల్ గా సినిమాని తీశారు. ప్రతి ఫ్రేం బావుందని ఆడియన్స్ చెబుతున్నారు. ప్రగతికి థ్యాంక్స్. సినిమా బావుందని, విరాట్ చాలా బాగా చేశాడని ఆడియన్స్ చెబుతుంటే చాలా ఆనందంగా వుంది. నా తొలి సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ప్రేక్షకులకి ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించాలని యూనిట్ అంతా చాలా కష్టపడి పని చేశాం. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా బావుందని చెప్పడం ఆనందాన్ని ఇచ్చింది. సినిమాని చూసి ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇంకా బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను”

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పెదకాపు-1′ చిత్రాన్ని ఇప్పటివరకూ ఆదరించిన, ముందుముందు ఆదరించినబోయే ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘పెదకాపు’ చిత్రం కోసం పనిచేసిన   యూనిట్ అందరి పనితనం గురించి ప్రత్యేకంగా ప్రసంశలు రావడం ఆనందంగా వుంది. విరాట్ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. టీజర్ ట్రైలర్ లో విరాట్ మొదటి సినిమా హీరోలా లేడని, అనుభవం వున్న నటుడిలా చేశాడని అన్నారు.  పూర్తి  సినిమా  చూసిన తర్వాత ఓ కొత్త హీరో చేశాడని కాకుండా ఈ సినిమాతో ఇండస్ట్రీకి కొత్త హీరో వచ్చాడని యునానిమస్ గా అందరూ యాక్సెప్ట్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. చోటా గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.

ప్రేక్షకుల మనసుని కదిలిస్తే గొప్ప సినిమా అవుతుందని నమ్ముతున్నాను. అలా ఈ పెదకాపు సినిమా ప్రేక్షకుల మనసుని కదలించింది. ఇందులో ఇంట్రడక్షన్ సీన్ వేరే లెవల్ అని ప్రేక్షకులు చెబుతున్నారు. అలాగే ఇంటర్వెల్ బాంగ్ ముందు వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ ..ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఎపిసోడ్స్ చూడలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. పెదకాపు కంటెంట్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, ముందుముందు ఆదరించబోతున్న ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు’ తెలిపారు.

ఛోటా కే నాయుడు మాట్లాడుతూ.. పెదకాపు సినిమా చూసి ఛోటా కే నాయుడు మళ్ళీ పుట్టాడు అంటున్నారు. ఇది నాకు పునర్జన్మ. నాకు ఈ పునర్జన్మ ఇచ్చిన నిర్మాత రవీందర్ గారికి, దర్శకుడు శ్రీకాంత్ అడ్దాల గారికి ధన్యవాదాలు. నాతో పుట్టిన మరో నక్షత్రం మా హీరో విరాట్ కర్ణ. టెర్రిఫిక్. విరాట్ ని తెరపై చూసిన ప్రేక్షకులు.. చిరంజీవి గారిని చిన్నప్పుడు చూసినట్లుందని, ప్రభాస్ గారిని చిన్నప్పుడు చూసినట్లుందని అంటున్నారు. చాలా అద్భుతమైన ప్రసంశలు వస్తున్నాయి. ఈ సినిమాని ఇంతగొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.

ప్రగతి శ్రీ వాస్తవ మాట్లాడుతూ.. పెదకాపు చిత్రానికి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని చోట్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News