- Advertisement -
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టు పెద్ది. ఈ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ ఉండబోతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నిన్న శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ షాట్ గ్లింప్స్ రికార్డు వ్యూస్ సాధించింది. 24 గంటల్లోపే 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి.. ‘దేవర’, ‘పుష్ప2’ల రికార్డు బ్రేక్ చేసింది.
దేవర 24 గంటల్లో 26 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఇప్పటివరకు టాప్ లో ఉన్నది. తాజాగా పెద్ది గ్లింప్స్ దాన్ని బ్రేక్ చేసి.. యూట్యూబ్ లో ట్రెండింగ్ కొనసాగుతోంది. ఈ గ్లింప్స్ కు నేషనల్ వైడ్ గా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఎఆర్ రహ్మన్ అందించిన బీజిఎం కూడా అదిరిపోయింది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారవు.
- Advertisement -