- Advertisement -
హైదరాబాద్: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా ‘RC16’ నుంచి అప్‌డేట్ విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఉన్న సరికొత్త లుక్ రాంచరణ్ అభిమానులను అలరిస్తోంది. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఉప్పెన్ సినిమాలో బుచ్చిబాబు అద్భుతంగా తెరకెక్కించాడు. సుమారు రెండు సంవత్సరాల తరువాత సినిమా విడుదల కానుండడంతో భారీగా ఆశలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు తోడుగా జాన్వీకపూర్ నటిస్తున్నారు. చెర్రి పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
- Advertisement -