- Advertisement -
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్- డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ పెద్ది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా పెద్ది ఫస్ట్ షాట్ అనే పేరుతో ఈ మూవీ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ మాస్ అవతార్ లో అదుర్స్ అనిపించాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ రూపొందిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గ్లింప్స్ లో వెల్లడించారు.
- Advertisement -