Sunday, January 19, 2025

కాంగ్రెస్ కుండలా పగిలిపోతుంది: పెద్ది సుదర్శన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌కు అనర్హత నోటీసులు వచ్చాయని, తరువాత వచ్చేది ఎంఎల్ఎ కడియం శ్రీహరికేనని మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. మడికొండలో స్టేషన్‌ఘన్‌పూర్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. త్వరలో స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఎన్నికలు రానున్నాయని, కడియం శ్రీహరికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. బిఆర్‌ఎస్‌ను మోసం చేసిన కడియం కాంగ్రెస్‌ను కూడా మోసం చేయడం ఖాయమన్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత కాంగ్రెస్ కుండలా పగిలిపోతుందని చురకలంటించారు. కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, భారీ మెజార్టీతో సుధీర్ కుమార్‌ను గెలిపించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి సుధీర్ కుమార్, ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌సి మధుసూదనాచారి, మాజీ ఎంఎల్‌ఎలు రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డిలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News