Monday, January 20, 2025

మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట : హన్మంతరావు

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి : అన్ని డివిజన్‌లలో ప్రజలకు అవసరమైన మౌ లిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మై నం పల్లి హన్మంతరావు తెలిపారు. శనివారం ఆయన, గౌతంనగర్ డివిజన్ ప రి ధిలోని మీర్జాలగూడలో రూ.26 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు పనులకు స్ధానిక కార్పొరేటర్ మేకల సునిత రాముయాదవ్‌తో కలిసి శం కుస్ధాపన చేశారు. అనంతరం మల్లికార్జున్‌నగర్‌లోని మల్లన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మల్కాజిగిరి నియోజకవర్గం స మగ్రాభివృద్ధే లక్షంగా అన్నిడివిజన్‌లలోని వివిధ కాలనీలు, బస్తీలలో అ భి వృద్ధి పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు.

ఇంకా అపరిష్కృత సమ స్య లుం టే సాధ్యమైంత త్వరగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీలలో ఇంకా ఏమైనా సమస్యలుంటే తనకు చెప్పాలని, వాటిని ప రి ష్క రిస్తానన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఎట్టి పరిస్ధితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈ లౌక్య, ఏఈ దివ్యజ్యోతి, ఆనంద్‌బాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, మల్కాజిగిరి డివిజన్ మాజీ కార్పొరేటర్ జ గధీష్‌గౌడ్, సీనియర్ నాయకుడు మేకల రాముయాదవ్‌లు పాల్గొన్నారు.

మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని నర్సింహరెడ్డినగర్‌లో పెండింగ్‌లో ఉన్న అ భివృద్ధి పనులన్నీ పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హమీ నిచ్చారు. శనివారం కాలనీ వాసులు, ఎమ్మెల్యేను కలిసి రోడ్లు, డ్రైనేజీ తదితర పనులన్నీ పరిష్కరిచాంలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంద్‌బాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, మల్కాజిగిరి డివిజన్ మాజీ కార్పొరేటర్ జగ ధీ ష్ గౌడ్, నాయకులు జీఎన్‌వీ సతీష్‌కుమార్, పిట్ల శ్రీనివాస్, రాముయాదవ్, మోహన్‌రెడ్డి, సంతోష్ రాందాస్, సంజయ్, కాలనీ వాసులు రవీంధర్, రవి కు మార్, రాము, లక్ష్మణ్, పార్ధు, రవిరెడ్డి, శంకర్, కుమార్, కోమల దేవి తదిత రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News