Thursday, December 19, 2024

చంద్రబాబుపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబును రాజకీయ వికలాంగుడిగా అభివర్ణించారు. పొత్తులు లేకపోతే చంద్రబాబు నిలబడలేరనీ, అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకమని అన్నారు. జుట్టు అందలేదు కాబట్టి బిజేపి పెద్దల కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి బిజేపి, జనసేన ఊతకర్రలుగా మారాయన్నారు. ఈ మూడు పార్టీల పొత్తు తాము ముందే ఊహించామని, రానున్నఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేసి, గతంలో కంటే భారీ మెజారిటీ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News