Sunday, January 19, 2025

పీర్జాదిగూడ కమిషనర్ ఒంటెద్దు పొకడలు

- Advertisement -
- Advertisement -

బోడుప్పల్ ః పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వంశీ కృష్ణ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.సాదారణ ప్రజల నుండి ప్రజా ప్రతినిధుల వరకు అయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మొదలు నేటి వరకు ఆఫీసు రిజీస్టర్లో సంతకాలు చేయకుండా అసలు ఆఫీసుకు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడ వెళ్తారో కూడా తెలియన పోవడంతో పలు సమస్యల గోడు చెప్పుకుందామని వచ్చే ప్రజలు వెనుతిరిగి పోవడం పరిపాటిగా మారింది.

ప్రధానంగా నగర పరిధిలో మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైతం డుమ్మా కొట్టడం పలవురిని అశ్చర్యానికి గురిచేసింది.తెలంగాణ ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మాకంగా ఇంటి అనుమతులు పొందటం సులభతరం చేస్తూ తీసుకువచ్చిన టీఎస్ బీ పాస్ కు తూట్లు పొడుస్తూ షో కాస్ నోటీసులు అందజేస్తూ కాలయాపన చేస్తూ ఇచ్చి అనుమతులు సైతం రద్దు చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుండటంతో ఒరవైపు అనుమతులు రాకపోవడం మరో వైపు కట్టిన డబ్బులు సైతం తిరిగి రాకపోడంతో ప్రజలు ఏం చేయాలో తెలియన దిక్కుతోచని పరిస్థితిలో మేయర్,కార్పొరేటర్లకు మోరపెట్టుకుంటున్నారు.

సొంతు ఇల్లు కట్టుకోవడం దేవుడెరుగు..కట్టుకున్న ఇళ్లు కూడా కూల్చేస్తారేమోనని బయాందోళనలో ప్రజలు పక్క ప్రాంతాలకు వెళ్లి నివాసం ఉంటే బాగుండు అనుకుంటున్నారు..
కమిషనర్..కార్యాలయానికి ఎప్పుడు వస్తారో,ఎప్పుడు వెళ్తారో ఎవరికి తెలియని పరిస్థితి
కార్యాలయానికి రాకపోవడం కనీసం మున్సిపల్ అధికారులు గాని ఉన్నతాధికారులకు కలెక్టర్ ,అడిషనల్ కలెక్టర్ కు సైతం ఎలాంటి సమాచారం అందించడకుండా ౩ పని దినాలు సెలవులపై వెళ్లి ప్రజల సమస్యలను గాలికొదిలేస్తున్నారని,మున్సిపల్ వాహనాలతో పాటు వ్యక్తిగత వాహనాలకు సైతం మున్సిపల్ డీజిల్ వాడుకోవడం ,సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం..ఇదిలా కొనసాగితే అభివృద్ధి లో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన పీర్జాదిగూడ భివిష్యత్ అగమ్యగొచరంగా మారుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News