Thursday, December 5, 2024

ఎసిబి వలలో పీర్జాదిగూడ శానిటరీ ఇన్‌స్పెక్టర్

- Advertisement -
- Advertisement -

బోడుప్పల్ : ఓ మహిళ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసే జానకి రెడ్డి కార్యాలయానికి శానిటరీ వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్ శ్రీరాములుకు బిల్లులు మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేయడంతో అ కాంట్రాక్టర్ ఎసిబి అధికారులను సంప్రదించాడు. నిఘా పెట్టిన ఎసిబి అధికారులు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కార్యా లయంలోని శానిటేషన్ విభాగంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ సహాయకురాలు సరోజ ద్వారా కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. విచారించగా నేరం అంగీకరించారు. అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్టు ఎసిబి అడిషనల్ ఎస్పి సూర్యనారాయణ తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News