- Advertisement -
ఇండియాలో పరిణామాలపై చెప్పలేం
వాషింగ్టన్: స్పై టెక్నాలజీని సభ్యసమాజానికి వ్యతిరేకంగా వాడటం ఆందోళనకర విషయం అని అమెరికా తెలిపింది. ఇండియాలో పెగాసస్ స్పైవేర్ వ్యవహారం దశలో సౌత్, సెంట్రల్ ఆసియాన్ వ్యవహారాల యాక్టింగ్ అసిస్టెంట్ సెక్రెటరీ డియాన్ థాంప్సన్ స్పందించారు. సభ్య సమాజం, ప్రభుత్వ విమర్శకులు, జర్నలిస్టులుపై స్పై టెక్నాలజీని ప్రయోగించడాన్ని అమెరికా ఎప్పుడూ అంగీకరించదని తెలిపారు. అయితే ఇండియాలో పెగాసస్ అంశం పూర్తి వివరాలు తమకు తెలియవని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చట్టానికి , నిబంధనలకు వ్యతిరేకంగా టెక్నాలజీని సంస్థలు, వ్యక్తులపై వాడి , దీనిని దుర్వినియోగపర్చడం ఆందోళనకరమే అని స్పష్టం చేశారు. ఇండియాలో పరిణామంపై ప్రత్యేకంగా తమ వద్ద సమాచారం లేదని, తెలుసుకుంటామని, టెక్నాలజీ దుర్వినియోగం తగదనే విషయాన్ని అమెరికా ఎప్పుడూ ఖండిస్తూనే ఉంటుందని తేల్చిచెప్పారు.
- Advertisement -