Monday, December 23, 2024

పెగాసస్ స్పైవేర్‌ను కొన్న చంద్రబాబు సర్కార్

- Advertisement -
Mamata Benerjee
మమతా బెనర్జీ వెల్లడి
కోల్‌కతా: వివాదాస్పద పెగాసస్ స్పైవేర్‌ను నాలుగైదేళ్ల క్రితమే నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ. 25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు అందాయన్నారు. అయితే ఇది ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబందించినది, చట్ట విరుద్ధమైనది అయినందున తాము కొనలేదని మమతా వెల్లడించారు.
‘ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ సంస్థ పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ. 25 కోట్లకు అమ్ముతామంటూ నాలుగైదేళ్ల క్రితం మా రాష్ట్ర పోలీసులను సంప్రదించింది. విషయం తెలుసుకున్న నేను ఆ సాఫ్ట్‌వేర్ మాకు అవసరంలేదని చెప్పాను’ అని ఆమె వెల్లడించారు. అయితే ఈ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం దానిని దేశ భద్రత కోసం ఉపయోగించడానికి బదులుగా రాజకీయ ప్రయోజనాల కోసం జడ్జీలు, ప్రతిపక్షనేతలు, ఇతర అధికారులపై నిఘాకు ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఇదిలావుండగా 2017లో పెగాసస్ సాప్ట్‌వేర్‌ను భారత ప్రభుత్వం 2బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందంటూ ‘న్యూయార్క్‌టైమ్స్’లో వచ్చిన కథనం ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News