Tuesday, March 18, 2025

మంచి ఫన్ బ్లాస్ట్‌లాంటి సినిమా

- Advertisement -
- Advertisement -

సప్తగిరి నటిస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్‌తో పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచాలను సృష్టించాయి. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో హీరో సప్తగిరి మాట్లాడుతూ “పెళ్లికాని ప్రసాద్ సినిమా కోసం మాకు మేము ఒక ఎగ్జామ్ రాసుకున్నాం. నా మనస్సాక్షిగా 100 శాతం మంచి మార్కులు వేసుకున్నాను. ఈ సినిమాకి ఆడియన్స్ దగ్గర కూడా మంచి మార్కులు పడతాయని ఆశిస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. హీరోయిన్‌గా నటించిన ప్రియాంక శర్మకి థాంక్యూ. అన్నపూర్ణమ్మ, ప్రమోదిని మిగతా నటులంతా ఈ సినిమాలో చేసే హడావిడి తప్పకుండా కడుపుబ్బా నవ్విస్తుంది. ఇందులో నా క్యారెక్టర్ మురళి గౌడ్‌లో ఒక నిజాయితీ కనిపిస్తుంది. ఈ సినిమా మంచి ఫన్ బ్లాస్ట్‌గా ఉంటుంది”అని అన్నారు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ ధన్యవాదాలు. మా ప్రొడ్యూసర్ లేకపోతే ఈ సినిమా లేదు. అందరూ మార్చి 21న థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. ప్రొడ్యూసర్ కేవై బాబు మాట్లాడుతూ “ఈ సినిమా కథ, కామెడీ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ ఇది. మా టీజర్ రిలీజ్ చేసిన ప్రభాస్‌కి, ట్రైలర్ రిలీజ్ చేసిన వెంకటేష్‌కి, దిల్ రాజు, శిరీష్, మారుతికి, సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక శర్మ, అన్నపూర్ణమ్మ, ప్రమోదిని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News