సప్తగిరి హోల్సమ్ ఎంటర్ టైనర్ ’పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వ హించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్‌తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వి జన్ గ్రూప్ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సు క్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెం కటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో సప్తగిరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఫన్ జోనర్ లో కామెడీకి మంచి స్కోప్ ఉండే ఒక క్యారెక్టర్ చేయాలనుకున్నాను.
అలాంటి సమయంలో పెళ్లి కాని ప్రసాద్ కథ వచ్చింది. స్క్రిప్ట్ విన్నాను చాలా నచ్చింది. -డైరెక్టర్ అభిలాష్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నవ్వించాడు. అప్పుడే సినిమా తప్పకుండా వర్కవుట్ అ వుతుందని నమ్మకం వచ్చింది. ఫస్ట్ కాఫీ తీసుకెళ్లి మారుతి ఇంట్లోనే హోమ్ థియేటర్‌లో చూశాం . ఆయన సినిమా చూసి చాలా ప్రశంసించారు. సరై న దారిలో సినిమాని తీసుకెళ్లారని అభినందించా రు. వెంకటేష్ కెరీర్‌లో ఐకానిక్ క్యారెక్టర్ పెళ్లి కాని ప్రసాదు. ఈ కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్. నిర్మాత శిరీ ష్ ఈ సినిమా చూసి మమ్మ ల్ని అభినందించారు. ఈ సినిమాని ఎస్వీసిలో రిలీ జ్ చేయడం మా అ దృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళు కంటెంట్ నచ్చితే నే సినిమాని రిలీజ్ చేస్తారు. మా సినిమా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మాకు సహాయం చేసిన -ప్రభాస్, వెంకటేష్, దిల్ రాజు, శిరీష్, మారుతి, అనిల్ రావిపూడిలకు ధన్యవాదాలు. -ఇది చాలా ఫన్ ఓరియెంటెడ్ కాన్సె ప్ట్. శాసనాల గ్రంథంలో కట్నాల గురించి తాత ముత్తాతల నుంచి ఆ గ్రంథంలో పొందుపరిచి ఉం టారు. అందులో ఉన్న రూల్స్ ప్రకారం కట్నం వ స్తేనే పెళ్లి జరుగుతుంది. ఈ విషయంలో తండ్రి, కొడుకు మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా ఉంటుం ది. ఇది కేవలం ప్రేక్షకులు నవ్వుకోవడానికి చేసిన సినిమా” అని అన్నారు.