సప్తగిరి హీరోగా అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో ఓ అవుట్- అండ్- అవుట్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని విజన్ గ్రూప్‌కు చెందిన కె.వై.బాబు, థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మిస్తున్నారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్‌విసి) విడుదల చేస్తుంది.
టైటిల్, ఫస్ట్ లుక్‌తో సహా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లను మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమాకు పెళ్లి కాని ప్రసాద్ అనే టైటిల్ పెట్టారు. ఇది ఐకానిక్ బ్లాక్‌బస్టర్ మల్లీశ్వరిలో విక్టరీ వెంకటేష్ క్యారెక్టర్ ని గుర్తు చేస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ సప్తగిరి పాత్ర హాస్య స్వభావాన్ని తెలియజేస్తుంది. ఈ పోస్టర్ హిలేరియస్ డిజైన్ ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని సూచిస్తుంది. ప్రియాంక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.