- Advertisement -
సియాల్ : తైవాన్‌లో తన అధికారిక పర్యటనను ముగించుకుని అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ గురువారం దక్షిణ కొరియాకు చేరారు. అక్కడ పలువురు రాజకీయ నేతలతో చర్చలు జరిపారు. చైనా నుంచి తీవ్రనిరసనలు వ్యక్తం అయినా తైవాన్ స్వయం పాలిత ప్రజాస్వామిక అధికారాన్ని అమెరికా రక్షించి తీరుతుందని పెలోసీ స్పష్టం చేశారు. ఇప్పుడు దక్షిణ కొరియాలో అక్కడి స్పీకర్ జిన్ ప్యో, పార్లమెంట్‌లోని ఇతర సీనియర్ సభ్యులతో సమావేశం అయ్యారు. చైనా చర్యలను వారికి వివరించినట్లు తెలిసింది, కొరియా దేశాల మధ్య ఉన్న కీలకమైన సరిహద్దులకు కూడా ఆమె వెళ్లుతారని భావిస్తున్నారు. ఈ నిస్సైనీకరణ ప్రాంతం ఇప్పుడు అమెరికా సారధ్యపు ఐరాస దళాలు, ఉత్తరకొరియా పర్యవేక్షణలో ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా రెండు కొరియాల మద్దతుకు అమెరికా వ్యూహాత్మక చర్యలకు దౌత్యానికి దిగుతున్న విషయం పెలోసి పర్యటనతో మరింత స్పష్టం అయింది.
- Advertisement -