Monday, December 23, 2024

అరుణాచల్ ముఖ్యమంత్రిగా మూడో సారి పెమా ఖండూ ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడం వరుసగా ఇది మూడోసారి. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన చౌనా మే కూడా ప్రమాణస్వీకారం చేశారు.

అరుణాచల్ ప్రదేశ్ కెటి పర్నాయక్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. పెమా ఖండూతో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఖండూ సహా మరో పది మంది క్యాబినెట్ మంత్రులు – బియురామ్ వాహ్గే, న్యాటో దుకామ్, గాబ్రియేల్ డెన్వాంగ్ వాంగ్సు, వాంగ్కీ లోవాంగ్, పసాంగ్ దోర్జీ సోనా, మామా నటుంగ్, దాసంగ్లు పుల్, బలో రాజా, కెంటో జిని మరియు ఓజింగ్ టేసింగ్ ఉన్నారు.

ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జెపి.నడ్డా, కిరణ్ రిజిజు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, తదితర ప్రముఖులు హాజరయ్యారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News