Saturday, December 21, 2024

ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పెంబర్తి, చంద్లాపూర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జాతీయస్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు గ్రామాలు ఎంపికయ్యాయి. వాటిలో జనగామ జిల్లాకు చెందిన పెంబర్తితో పాటు సిద్ధిపేట జిల్లాకు చెందిన చంద్లాపూర్ ఉన్నాయి. బుధవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత మండపంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి విద్యావతి చేతుల మీదుగా ఈ అవార్డులను రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలాజా రామయ్యర్‌ల సమక్షంలో పెంబర్తి గ్రామ సర్పంచ్ అంబాల ఆంజనేయులు, సిద్దిపేట్ జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, చంద్లాపూర్ గ్రామ సర్పంచ్ సూరగోని చంద్రకళ అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News