Thursday, January 23, 2025

జ్ఞాపిక అనగానే గుర్తొచ్చేవి పెంబర్తి మెమెంటోలు

- Advertisement -
- Advertisement -

దక్కన్ హెరిటేజ్ అకాడమీ ఛైర్మన్ వేదకుమార్ మణికొండ

మన తెలంగాణ / హైదరాబాద్ : జ్ఞాపిక అనగానే గుర్తొచ్చేవి పెంబర్తి మెమెంటోలు అని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ఛైర్మన్ వేదకుమార్ మణికొండ అన్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రామీణ పర్యాటక కేంద్ర నోడల్ ఏజెన్సీ గత నెలలో జనగామ జిల్లాలోని పెంబర్తి, సిద్దిపేటలోని చంద్లాపూర్ గ్రామాలను ఉత్తమ గ్రామీణ పర్యాటక గ్రామాలుగా గుర్తించిన సందర్భంగా ఈ మేరకు ఆదివారం ప్రొఫెసర్ వేదకుమార్ మణికొండ ఈ మేరకు ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ రామ్‌రాజ్ , ధనంజయ్య తదితర సామాజిక కార్యకర్తలతో కలిసి వేదకుమార్ పెంబర్తి గ్రామాన్ని సందర్శించి కళాకారులను కలుసుకుని కళలు వాటి గురించి చర్చించి కళాకారులను సత్కరించారు.

కాకతీయ వంశ కాలం నుంచి పెంబర్తి హస్తకళలు, లోహపు పనులకు ప్రసిద్ధి చెందిందన్నారు. కంచు కళా వైభవానికి పుట్టినిల్లయిన వరంగల్ జిల్లా జనగాం మండలానికి చెందిన పెంబర్తి గ్రామానికి గొప్ప కళాఖండాలుగా ప్రపంచ పటంలో సుస్థిరమైన పేరు ప్రతిష్టలు ఉన్నాయన్నారు. మరీ ముఖ్యంగా పెంబర్తి కళారూపాలు సంస్క ృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, గృహ అలంకరణ వస్తువులను- గుడి, బడి మొదలైన అనేక హస్త కళారూపాలను కళాకారులు చేతి నైపుణ్యంతో తయారు చేస్తారన్నారు. ఇత్తడి సామగ్రి, కళాఖండాలు, లోహ పనిముట్లు రోజువారీ ఉపయోగించే వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ గ్రామంలో ఇత్తడి కంచు వంటి రాగి మిశ్రమాలను ఉపయోగించి విగ్రహాలు, శిల్పాలు కాస్టింగ్లను విస్తృతంగా తయారు చేస్తారన్నారు. మధ్యలో కొంతకాలం ఈ కళకు ఆదరణలేక అంతరించి పోయిందని, అయితే తర్వాత నిజాం నవాబు కాలంలో ఈ కళను ప్రభువులు బాగా ఆదరించి ఈ కళకు జీవం పోశారన్నారు. పెంబర్తి హస్తకళాకారులు తయారుచేస్తున్న మెమెంటోలు, షీల్ట్‌లు , వస్తువులకు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తోందన్నారు.

ఇది ఏ పరిస్థితుల్లో ఉందంటే ఇక్కడ తయారైన కళాత్మక వస్తువులను అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయని, నవాబ్, ఆయన పరివారం, అధికారుల అభిరుచులకు అనుగుణంగా పెంబర్తి కళాకారులు ఆకృతులు తయారు చేసేవారన్నారు. విశ్వకర్మలు కేవలం 20 శాతం మంది ఉండగా మిగతా వారు ముదిరాజ్, కుమ్మరి, రజక, తురక, మాల- మాదిగ, గౌడ, కురుమ తదితర కులాల వారు ఈ కళల తయారీలో నిమగ్నమయ్యారని వేదకుమార్ గుర్తు చేశారు. అతరించించి పోతున్న ప్రాచీన కళలను, కళాకారులను ప్రోత్సహించి వారిని వెలుగులోకి తీసుకు రావాడానికి తమ ప్రయత్నం చేస్తూ వారికి సరియైన ఆర్థిక సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందించడానికి తమ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తుందన్నారు.

కళాకారులకు అనుకూలంగా పనిముట్లు సమకూర్చి మరింత మెరుగైన కళారూపాలని తీర్చిదిద్దడానికి , కళను పరిరక్షిస్తూ టూరిజం మ్యాప్‌లో చోటు కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇతర సామాజిక వర్గాల యువతకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం ద్వారా వారి ఉపాధి కల్పనకు తోడ్పడ వచ్చునని ఆయన అన్నారు. కళల పునరుజ్జీవనానికి నాంది పలుకుతూ ఈ కళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ముందుకు రావాలని వేదకుమార్ మణికొండ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News