Monday, November 25, 2024

చెట్లు నరికిన లే అవుట్ యాజమాన్యానికి జరిమానా

- Advertisement -
- Advertisement -

కీసర: యాద్గార్‌పల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లు నరికిన లే అవుట్ యాజమాన్యానికి అధికారులు జరిమానా విధించారు. యాద్గార్‌పల్లిలోని విఆర్‌ఆర్ లే అవుట్‌లో రోడ్లకు ఇరువైపులా గత నాలుగేళ్ల క్రితం నాటిన చెట్లను బుధవారం నిర్వాహకులు నరికివేసారు.

ఈ విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు గురువారం జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, కీసర ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మణ్ విఆర్‌ఆర్ లే అవుట్‌ను సందర్శించి విచారణ చేపట్టారు. 191 చెట్లను నరికివేసినట్లు గుర్తించి విఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ యాజమాన్యానికి రూ.60,912 జరిమానా విధించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మండల పంచాయతీ అధికారి వినూత్న, పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News