Thursday, January 23, 2025

పలు రియల్ సంస్థలకు జరిమాన విధింపు : రెరా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ’రెరా’ (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) రిజిస్ట్రేషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై రెరా అపరాధ రుసుం విధించింది. ’రెరా’ అనుమతుల లేకుండా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున షోకాజు నోటీసులు చారీ చేసిన 15 రోజులలోగా సంజాయిషీ సమర్పించాలని ఆదేశించినప్పటికీ గడువులోగా సమాధానాలు సమర్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేడ్చల్, మల్కాజిగిరి, కొంపల్లి శ్రీనివాసం డెవలపర్స్ సంస్థకు రూ.3 లక్షలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కుతుబుల్లాపూర్ సుచిత్ర ప్రాంతంలోని డి.ఎన్.ఎస్. ఇన్ఫ్రా కంపెనీకి రూ.36 లక్షల 50 వేలు, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు అమిటెడ్ సంస్థకు రూ.25 లక్షలు అపరాధ రుసుంగా విధిస్తూ మంగళవారం రెరా’ ఆదేశాలు జారీ చేసింది.

రేరా’ నిబంధనలు ఉల్లంఘించి ఈ సంస్థలు అడ్వర్ టైజింగ్, మార్కెటింగ్ కార్యక్రమాలు చేపట్టినందున రేరా’ నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి ముందుగా ’రెరా’లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, రెరా’ నిబంధనలు ఉల్లంఘించే ప్రాజెక్టులపై చట్టరీత్యా తగుచర్యలు తప్పవని రెరా ప్రతినిధులు హెచ్చరించారు. సొంతింటి కల సాకారం చేసుకోవాలనే కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు రియల్ ఎస్టేట్ సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరించాలని అన్నారు. రెరా చట్టాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News