Saturday, November 23, 2024

ప్రియురాలి భర్తను హత్య కేసులో ఇరికించాలని…!

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ హత్య చేసి భర్తను ఇరికించాలనుకున్నారు… కానీ పోలీసులకు ప్రియుడు-ప్రియురాలు పట్టుబడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెనమలూరు మండలం కానూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రసాదంపాడు గ్రామానికి చెందిన రవీంద్ర- మృధులాదేవీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృధులాదేవీ ఓ బాడీకేర్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తుంది. అక్కడ సాయి ప్రవీణ్‌తో మృధులాదేవీకి పరిచయం ఏర్పడడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది.

దీంతో భార్యభర్తలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల వరకు ప్రవీణీతోనే ప్రియురాలు ఉండిపోయేది. దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో చిన్నాకుమారుడు మానసిక ఆందోళనకు గురై చక్కెర వ్యాధి వచ్చింది. దీంతో భర్త తన భార్యకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పలుమార్లు కబురు పంపాడు. భర్త ఉన్నంత వరకు తాము కలిసి ఉండలేమని ప్రియుడు ప్రియురాలు అనుకున్నారు. ఓ హత్య కేసులో భర్తను ఇరికిస్తే సరిపోతుందని అప్పుడు విడాకులు తీసుకొవచ్చనే నిర్ణయానికి వచ్చారు. అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న నాగమణి అనే వివాహితతో సాయి ప్రవీణ్ పరిచయం పెంచుకొని తన ప్రియురాలిని కలిపాలని బతిమాలాడు. ఇదే సమయంలో భర్తతో కూడా భార్య మంచిగా ఉంటున్నట్టుగా నటించింది.

జనవరి 13వ తేదీన నాగమణి తన భర్త కిరణ్ గోపాల్ ఏలూరుకు వెళ్లిపోవడంతో తన పథకం అమలు చేయాలని ప్రవీణ్ నిర్ణయం తీసుకున్నాడు. అనంతరం మృధులాదేవీ తన భర్తకు సంబంధించిన కొన్ని మాటలను రికార్డు చేసింది. నాగమణిని కానూరులోని ఓ వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లారు. రవీంద్ర తనని మోసం చేశాడని, శారీరకంగా వాడుకుని, తన బంగారం తాకట్టు పెట్టుకున్నాడని, ఏదైనా ప్రాణహాని జరిగితే రవీంద్రే కారణమని నాగమణితో వాయిస్ రికార్డు చేశారు. అనంతరం నాగమణిని చంపేసి వాయిస్ రికార్డును నాగమణి భర్తకు పంపించారు. మృధులదేవీ ఫోన్‌కు వాయిస్ రికార్డు పంపించారు. ఈ వాయిస్ రికార్డుతో భర్తను బెదిరించాలని ప్రియురాలుకు అతడు సూచించాడు. దీంతో రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తన భార్య వివాహేతర సంబంధం గురించి బయటపెట్టాడు. ప్రియుడు-ప్రియురాలును పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మధ్యలో ఏమీ తెలియని అమాయకురాలు తన భార్య ప్రాణం తీశారని కిరణ్‌గోపాల్ కన్నీరుమున్నీరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News