Saturday, December 21, 2024

చిన్న పత్రికలకు పెండింగ్ యాడ్ బిల్లులు విడుదల చేయాలి

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : రాష్ట్రంలో చిన్న పత్రికలకు ప్రభుత్వం చెల్లించాల్సిన నాలుగు నెలల అడ్వర్టయిజ్ బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే నిధులు విడుదల చేయాలని తెలంగాణ యునైటెడ్ ఎడిటర్స్ సంఘం కోరింది. యాడ్ సంబంధించి డబ్బులు నెలలుగా సర్కార్ విడుదల చేయకపోవడంతో చిన్న పత్రికల నిర్వహణ భారంగా మారిందని, ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి. హరీష్‌రావు చొరవ తీసుకుని తక్షణమే పెండింగ్ డబ్బులు చెల్లించేందుకు చర్యలకు ఉపక్రమించాలని సంఘం అధ్యక్షుడు మీర్ హదీఅతి రాష్ట్ర సమాచారశాఖ ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈ మేరకు ఆయన నాంపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ముస్లీంల పవిత్ర పండుగ బక్రీద్ సమీపిస్తున్న నేపథ్యంలో పెండింగ్ బిల్లులను తక్షణమే క్లీయర్ చేయాలని కోరారు.

చిన్న వార్త పత్రికలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రచురించిన ప్రకటనలను ముద్రించామని, దీని తాలూకు బిల్లులు జారీ చేయడంలోను నెలలుగా జాప్యం జరుగుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న యాడ్ డబ్బులను యుద్ధ్దప్రాతిపతికన విడుదల చేయాలని మీర్‌హదీ అలి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కారణంగా ఉద్యోగులు, జర్నలిస్టులకు జీతభత్యాలకు ఇవ్వడంలోను పలు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News