Monday, December 23, 2024

వారంలోగా పెండింగ్ దరఖాస్తులకు మోక్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్
పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను వా రంలోగా పరిష్కరించాలని అన్ని జిల్లాల కలెక్టర్‌లను తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. శుక్రవారం సిసిఎల్‌ఎ కా ర్యాలయం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణిలో పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఎల్‌ఎ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ లోక్‌సభ సాధారణ ఎన్నికల షె డ్యూల్ ప్రకటన కంటే ముందు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రాష్ట్రంలో 1.38 లక్షల పెం డింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించామని అన్నా రు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ధరణి ద రఖాస్తుల పరిష్కారానికి మరోసారి ప్రత్యేక కా ర్యాచరణ చేపట్టాలని, తహసీల్దార్, రెవెన్యూ డి విజన్ అధికారి, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థా యిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని నవీన్‌మిట్టల్ అన్నారు. సక్సేషన్, పెండింగ్ మ్యుటేషన్ వంటి దరఖాస్తులను రికార్డులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, డేటా కరెక్షన్ దరఖాస్తులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టి పరిష్కరించాలని ఆయన సూచించారు.

మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష
మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష చేసుకోవాలని, అధికంగా పెండింగ్ ఉన్న మండలాలకు అవసరమైన అదనపు సిబ్బందిని కేటాయించాలని నవీన్‌మిట్టల్ సూచించారు. ధరణి వెబ్ సైట్ సంబంధించి జిఎల్‌ఎం, టిఎం 33 దరఖాస్తులలో డిజిటల్ సంతకాల ప్రక్రియ మార్పులు చేస్తున్నామని, కొన్ని సమస్యలు తహసీల్దార్ స్థాయిలో, మరికొన్ని సమస్యలు రెవెన్యూ డివిజన్ అధికారి, మరికొన్ని సమస్యలు కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే భూ సంబంధిత సమస్యలను సైతం కలెక్టర్లకు బదిలీ చేస్తామని, వాటిని అత్యంత ప్రాధాన్యతతో సత్వర పరిష్కారం జరిగేలా చూడాలని సిసిఎల్‌ఏ కమిషనర్ నవీన్‌మిట్టల్ పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని, దీని కోసం జిల్లాలో భూముల మార్కెట్ విలువ, ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువ వివరాలతో కూడిన నివేదికను అందించాలని, మార్కెట్ విలువ నమోదులో ఎక్కడా ఎటువంటి వివాదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహారించాలని ఆయన పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు అనువైన భవనం లేదా భూమి కేటాయించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్లకు నవీన్‌మిట్టల్ సూచించారు. సిసిఎల్‌ఏ నుంచి జిల్లా కలెక్టర్లకు రిటర్న్ వచ్చిన దరఖాస్తుల్లో అధికంగా ఆర్‌ఎస్‌ఆర్ దరఖాస్తులు, సంబంధిత ఆధారిత డాక్యుమెంట్లు జత చేయని దరఖాస్తులు ఉన్నాయని నవీన్‌మిట్టల్ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఆర్ దరఖాస్తుల్లో తప్పుడు ఎంట్రీ జరిగితే దానిని ధ్రువీకరించి, తప్పుడు ఎంట్రీని తొలగించి, ఆర్‌ఎస్‌ఆర్ సవరణకు రిపోర్టుతో సహా దరఖాస్తులు పంపాలని కలెక్టర్లకు నవీన్‌మిట్టల్ సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News