Monday, January 20, 2025

టీచర్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

- Advertisement -
- Advertisement -

ఉపాధ్యాయ ఎంఎల్‌సి కూర రఘోత్తం రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించిన జి.పి.ఎఫ్, టి.ఎస్.జి.యల్.ఐ, సరెండర్ లీవు, మెడికల్ బిల్లులు, డి.ఎ,పి.ఆర్.సి. బకాయిలు బిల్లులు వెంటనే ఉపాధ్యాయుల ఖాతాలలో జమ చేయాలని ఉపాధ్యాయ ఎంఎల్‌సి కూర రఘోత్తం రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి అధ్యక్షత శుక్రవారం సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ఎంఎల్‌సి రఘోత్తం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించే ఏకైక సంఘం పిఆర్‌టియుటిఎస్ అని పేర్కొన్నారు. సంఘ పటిష్టతకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంఎల్‌సిలు బి.మోహన్ రెడ్డి, పూల రవీందర్, రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు, మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి, నాయకులు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి, చిత్తలూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News