Monday, December 23, 2024

సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ:జిల్లా పోలీస్ కార్యాలయం నుండి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విచారణలో ఉన్న కేసులను శాస్త్రీయ పద్ధతులతో విచారించాలని, శా స్త్రోక్తమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి పెండింగ్ కేసులు లేకుండా చూడాలని ఎస్.పి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసుల ను యాక్షన్ ప్లాన్‌తో పాటు నాణ్యమైన విచారణతో పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు లే కుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని,పెండింగ్ కేసుల ను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కే సుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు.

తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన 16 ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవ ంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రా ముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అ న్నారు. అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన,సత్వర సేవలు అందించాన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అనుసరించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని తెలియజేశారు.రోడ్డు ప్రమాదాలు జరగకు ండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని,ఓవర్ స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్,మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్ర త్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం,పి.డి.యస్ రవాణా లాం టి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవడం జ రుగుతున్నదని తెలిపారు. రిపీటెడ్ గా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ ను నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద రావు, డి.సి.ఆర్బి డి. యస్పి బి.రమేష్, డీఎస్పీలు, సి.ఐ లు మరియు యస్.ఐ లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News