Monday, January 20, 2025

బకాయిలు చెల్లించకపోతే తొలగిస్తాం

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : కొన్ని సంవత్సరాలుగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి కౌలు బకాయిలు చెల్లించని కౌలు రైతులను తొలగిస్తామని దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ బేల్ సింగ్ అన్నారు. కారేపల్లి మండలం మాదారం పంచాయతీ పరిధిలో గల ఆలయ భూములకు సంబంధించి గురువారం సర్వే నిర్వహించారు. పర్స అనంతరామయ్య ధర్మ సంస్థ యొక్క గుంపెల్ల గూడెం, మాదారం, గోవిందు తండా, గ్రామాల్లో దేవస్థాన భూములను సర్వే నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా బేల్ సింగ్ మాట్లాడుతూ, పెండింగ్ బకాయిలు ఈ నెల 25 లోపు పూర్తిగా చెల్లించకపోతే ఆ భూముల కు నోటీసులు ఇచ్చి వేలం వేస్తామని, అవసరమైతే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. భూములకు సంబంధించి త్వరలో పూర్తి సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కారేపల్లిలో పలు గ్రామాల్లో సుమారు 900 ఎకరాలకు పైగా భూమి ఉందనీ,అయితే మాదారం రెవిన్యూ విలేజ్ గోవిందు తండాలో దేవాలయ భూములకు సంబందించి కొన్నేళ్లుగా కౌలు బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారన్నారు.

సిబ్బంది పలు మార్లు షోకాజు నోటీసులు ఇచ్చినా రైతుల వద్ద నుండి ఎలాంటి స్పందన రావట్లేదన్నారు. అధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, కౌలు రైతులు సహకరించాలని కోరారు. ఈ సర్వేలో దేవాదాయ శాఖ జోనల్ సర్వేయర్ అనిల్ కుమార్, దేవాదాయ శాఖ భద్రాచలం ఇన్స్పెక్టర్ పిబేల్ సింగ్, సంస్థ కార్య నిర్వహణ అధికారి కె. వేణుగోపాలాచార్యులు, సిబ్బంది తోటకూరి వెంకటేశ్వర్లు, పర్సా సాయికుమార్, మూడ్ మోహన్, ఇతర దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News