Monday, December 23, 2024

పెండింగ్ ఓటరు దరఖాస్తులను పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ఈ నెల 23 వరకు పెండింగ్‌లో ఉన్న ఓటరు దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటరు జాబితా రూపకల్పనపై బూత్ స్థాయి అధికారులతో మాట్లాడారు.

రెండవ విడత ఓటరు జాబితా సవరణలో డ్రాప్ట్ ఓటరు జాబితా విడుదలకు ముందు ఈ నెల 23 వరకు మనకు వచ్చిన ప్రతి దరఖాస్తును స్క్రూటీని పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి దృవీకరణ పూర్తి చేయాలని, ఇంటిలో ఆరుగురు కంటే అధికంగా ఉంటే ఓటర్ల వివరాలు దృవీకరించుకోవాలన్నారు.

ఫోటో సిమిలర్, ఎంట్రీ, డబుల్ ఎంట్రీ తొలగించాలన్నారు. జిల్లాలో ఇంటింటి సర్వే నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు, ఆన్‌లైన్ ద్వారా ఫారం 6, ఫారం 7, ఫారం 8 క్రింద వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వీరబ్రహ్మచారి, ఎన్నికల డిటీ ప్రవీణ్ , సంబంధిత సెక్షన్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News