Thursday, November 14, 2024

పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంచాలి

- Advertisement -
- Advertisement -
  • మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు

సిద్దిపేట: పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంచాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణ 21వ వార్డు శ్రీనివాస నగర్ కాలనీలో మోర్ సూపర్ మార్కెట్ నుంచి లోహిత్ సాయి హాస్పిటల్ వరకు చేపట్టినటువంటి బిటి రోడ్డు నిర్మాణ పనులను, డ్రైనేజి వ్యవస్ధను పరిశీలించారు. తర్వాత పట్టణ 20వ వార్డు సాజీర్ పుర కాలనీలో చేపట్టినటువంటి బిటి రోడ్డు నిర్మాణ పనులను వార్డుకౌన్సిలర్లు, అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడి నుంచి రెండు కరీంనగర్ రోడ్డులో గల వడ్డెర కాలనీలో పర్యటించారు. కాలనీలో సిసి రోడ్డు, ప్రతి ఇంటికి యూజీడి అండర్ గ్రౌండ్ డ్రైనేజి కనెక్షన్‌ల నిర్మాణాన్ని చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

పనులను వెంటనే చేపట్టి సకాలంలో పనులను పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం కరీంనగర్ రోడ్డులో సిద్దిపేట పట్టణ టూ వీల్లర్ అసోసియేషన్ వారి కమిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. కమిటీ హాల్ నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబందిత అధికారులను, కాంట్రాక్టర్‌లను అదేశించారు. పనులలో జాప్యం తగదని వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని సూచించారు. మంత్రి హరీశ్‌రావు పట్టణంలోని పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఆరా తీయడం జరుతుందన్నా రు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని పట్టణంలోని పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్దంగా ఉంచాలన్నారు. కౌన్సిలర్లు రియాజుద్దిన్, నాయిని చంద్రం, కెమ్మసారం ప్రవీణ్, కోఆప్షన్ సభ్యులు సత్తయ్య, మాజీ కౌన్సిలర నర్సింలు, ఈఈ వీర ప్రతాప్, ఎఈ మహేశ్ , రంజిత్ ,పబ్లిక్ హెల్త్ ఎఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News