Saturday, December 21, 2024

పెన్‌గంగ మహోగ్రం

- Advertisement -
- Advertisement -


ఎగువన కురుస్తున్న అతి భారీ వర్షాలతో పాటు మహారాష్ట్రలో ని వరదతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగ తీవ్ర ఉ గ్రరూపం దాల్చింది. జైనాథ్ మండలంలోని డొలారా దగ్గర 50 అడుగుల ఎత్తున ఉన్న బ్రిడ్జిని తాకుతూ నది ప్రవహి స్తోంది. దీంతో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ 44వ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేయడంతో వేల సంఖ్యలో వా హనాలు ఆగిపోయాయి. శనివారం రాత్రి దాదాపు 7 గంటల ప్రాంతంలో రాకపోకలను నిలిపి వేసిన అధికారులు ఆదివా రం మధ్యాహ్న సమయంలో పెన్‌గంగా ఉధృతి కొద్దిమేర తగ్గ గానే వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఒక్కో వా హనాన్ని ఆ బ్రిడ్జిపై నుంచి పంపడంతో భారీగా ట్రాఫిక్ జాం అయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 20 కిలో మీటర్ల వరకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయా యి. దీంతో మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆదివారం ఉదయం వరకు 4లక్షల 80వేల క్యూ సె క్కుల నీటి ప్రవాహం ఉండగా మధ్యాహ్న సమయం వరకు 1 లక్షల క్యూసెక్కుల నీరు తగ్గడంతో ఆ బ్రిడ్జిపై నుండి వాహనా లకు అనుమతిచ్చారు. అయితే శనివారం రాత్రి నుంచి వాహ నాలు నిలిపివేడయంతో ప్రయాణికులు గంటల తరబడి వాహ నాల్లో ఉండిపోవల్సి వచ్చింది. చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇ బ్బందులు పడ్డారు. దీంతో పోలీస్‌శాఖ అధికారులు ప్రయాణి కులకు వాటర్ ఫ్యాకెట్లను అందజేశారు. రాకపోకలకు అను మతిచ్చిన దాదాపు నాలుగు, ఐదు గంటల వరకు ట్రాఫిక్ క్లీయర్ కాలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News