Sunday, December 22, 2024

17 మంది రోగులను హత్య చేసిన నర్సు.. 700 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : తాను పనిచేసే ఆస్పత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేస్తున్న ఓ నర్సుకు అమెరికా కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 20202023 మధ్య కాలంలో అమెరికా లోని పెన్సిల్వేనియాకు చెందిన నర్సు హీథర్‌ప్రైస్‌డీ (41) వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసింది. ఆ సమయంలో ఆమె ఆస్పత్రికి వచ్చే రోగులకు మోతాదుకు మించిన ఇన్సులిన్‌ను ఇంజక్ట్ చేసేది. అలా ప్రైస్‌డీ 22 మందికి అధిక మొత్తంలో ఇన్స్‌లిన్ ఇచ్చింది. దానివల్ల 17 మంది రోగులు మరణించారు.

తాను మూడు హత్యలు19 హత్యాయత్నాలు చేసినట్టుగా నిందితురాలు నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో ఆస్పత్రి వర్గాలు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాయి. కేసు విచారణ సమయంలో భాగంగా నర్సు ఇదే విధంగా మరికొందరి మరణానికి కారణమయినట్టు తేలింది. గతంలో ఆమెతో కలిసి పనిచేసిన సహోద్యోగులను పోలీస్‌లు విచారించారు. ఆమె రోగులతో దురుసుగా ప్రవర్తించేదని, తరచూ వారిని అవమానించేలా మాట్లాడేదని వారు పేర్కొన్నారు.

ఆమె తన తల్లికి చేసే మెసేజ్‌ల్లో కూడా తన చుట్టూ ఉన్నవారు, రోగులు తనకు నచ్చట్లేదని వారికి హాని కలిగించాలని ఉందని తరచుగా చెప్తుండేది. “ ఆమెకు ఎటువంటి జబ్బు లేదు. మతిస్థిమితం సరిగానే ఉంది. కానీ తన వ్యక్తిత్వం మంచిది కాదు. ఆమె నా తండ్నిని చంపడం నేను స్వయంగా చూశాను ” అని బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు. ఇన్సులిన్ అధిక మోతాదులో ఇస్తే హైపోగ్లైసీమియాకు దారి తీస్తుంది. దీనివల్ల హృదయ స్పందన పెరుగుతుంది. గుండెపోటుకు కూడా దారి తీయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News