Monday, March 31, 2025

‘పెన్నీ’ సాంగ్ ప్రోమో విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేష్ సరసన మహానటి కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. తాజగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ పెన్నీ ప్రోమోను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ లిరికల్ వీడియో సాంగ్ లో మహేష్ బాబు కూతురు సితార తన స్టెప్పులతో అభిమానులను అలరించనున్నట్లు ప్రోమోను వదిలారు. పూర్తి పాటను ఈనెల 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ ‘కళావతి…’ రికార్డు వ్యూస్ తో రికార్డు సృష్టించింది. ఈ మూవీకి స్టార్ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీని మే 12న వేసవి కానుకగా విడుదల చేయనున్నారు.

https://youtu.be/T30RoCkiovE

Penny Song promo out from Sarkaru Vaari Paata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News