Sunday, January 19, 2025

విశ్రాంత రైల్వే ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం పెన్షన్ అదాలత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పెన్షన్ అదాలత్ – 2023ను సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో శుక్రవారం నాడు నిర్వహించింది. ఈ కార్యక్రమములో ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ కిషోర్ బాబు, ఇతర సీనియర్ రైల్వే అధికారులు వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వేపరిధిలోని ఆరు డివిజన్లు అంటే సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్ , గుంటూరు నాందేడ్ , వర్క్ షాప్‌లు ఇతర యూనిట్లు విశ్రాంత రైల్వే ఉద్యోగుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు వారి వారి ప్రాంగణంలలో వేర్వేరుగా పెన్షన్ అదాలత్‌ను నిర్వహించాయి.

ఈ అదాలత్‌కు పెద్ద ఎత్తున హాజరైన విశ్రాంత రైల్వే ఉద్యోగులు తమ పెండింగ్ ఫిర్యాదులపై అధికారులతో మాట్లాడారు. పింఛనుదారులకు భవిష్యత్తులో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వారు సకాలంలో తెలియజేయాలని తద్వారా సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి వీలు అవుతుందని అధికారులు సూచించారు. విశ్రాంత రైల్వే ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులను అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News