Saturday, November 23, 2024

కలక్టరేట్ ఎదుట పెన్షనర్ల నిరసన

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : పెన్షనర్లకు సంబంధించి నగదు రహిత ఎంప్లాయీస్ హెల్త్ స్కీంలు (ఈహెచ్‌ఎస్)ను అమలు చేయడంతో పాటు అన్ని కార్పోరేట్ ఆసుపత్రుల్లో పెన్షనర్లకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్రులు సంయుక్త కార్యాచరణ సమితి కో ఆర్డినేటర్ టి.పురుషోత్తం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్య పరిష్కారం పట్ల సాచివేత ధోరణి అవలంభిస్తుందని ఈ వైఖరి పిన్షనర్లను ముదిమి వయస్సులో ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన తెలిపారు. బుధవారం పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి (పెన్షనర్స్ డేవీసి) పిలుపు మేరకు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత కలెక్టరేట్ ముఖ ద్వారం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలియజేశారు.

గోపిచంద్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో పురుషోత్తం మాట్లాడుతూ బకాయి పడ్డ రెండు విడతల డీఆర్ను సత్వరమే మంజూరు చేసి ఏక మొత్తంగా చెల్లించాలని పిఆర్సిని నియమించి ఐర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని 398 వేతనంతో పని చేసిన ప్రత్యేక ఉపాధ్యాయుల సర్వీసు కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరుతో పాటు పెన్షన్ ను వర్తింపజేయాలని పురుషోత్తం డిమాండ్ చేశారు. పిన్న నర్లందరికీ తెలంగాణ ఇన్సెంటివ్ మంజూరు చేయాలని పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ 12 ఏళ్లకు కుదించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముదిమి వయస్సులో పెన్షనర్లు ఇబ్బందులు పడకుండా ప్రతి నెల మొదటి తేదీనే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 20 ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన వారందరికీ పూర్తి స్థాయి పెన్షన్ అందించాలని జేఏసి డిమాండ్ చేస్తుందన్నారు.

అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ చిపి గౌతమక్కు అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి జేఎసి ప్రతినిధులు సరిశ పుల్లయ్య, కళ్యాణం నాగేశ్వరరావు, ఎస్. రంగారావు, డి. తిరుపతయ్య, సత్యనారాయణ నేతృత్వం వహించగా ఆందోళ కార్యక్రమంలో కె. కృష్ణమూర్తి, జి. శ్రీనివాసరావు, ఆర్. శ్రీరాములు, కె. వెంకటేశ్వర్లు, దావా చిట్టెమ్మ, మాధవరావు, కృష్ణమూర్తి, కుటుంబరావు, కోట్యా, శేషభూషణం, శర్మ, పెద్ద సంఖ్యలో పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News