Friday, January 3, 2025

కాఫీ తయారు చేసి లబ్ధిదారులకు ఇచ్చిన చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేశారు. పల్నాడు జిల్లాలోని యలమందలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో సిఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. యల్లమందలో పింఛన్ లబ్ధిదారు ఏడుకొండలు ఇంటికి చంద్రబాబు వెళ్లారు. దీపం పథకం గురించి ఆరా తీయడంతో పాటు ఏడుకొండలు ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేసి కుటుంబ సభ్యులకు చంద్రబాబు అందించారు. ఏడుకొండలు కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకుని, అతను దుకాణం పెట్టుకునేందుకు బిసి కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల రుణం ఇప్పించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులకు సూచించారు.

శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు సిఎం చంద్రబాబు అందజేశారు. ఆమె కుటుంబం కష్టాలు అడిగి సిఎం తెలుసుకున్నారు శారమ్మ కుమారుడికి ఎస్సి కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష రుణం ఇప్పించాలని, శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు.లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ డబ్బులు అందజేయాలని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 5,402 మంది వితంతువులకు పెన్షన్ మంజూరు చేసింది. భర్త చనిపోతే వెంటనే భార్యకు పెన్షన్ ఇచ్చింది. గతంలో 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసేవారు. కానీ పెన్షన్ మంజూరు విధానంలో ప్రభుత్వం పెను మార్పులు తీసుకొచ్చింది.  మూడు నెలలుగా వివిధ కారణాలతో పెన్షన్ తీసుకోని 50 వేల మందికి సైతం ఇవాళ పెన్షన్ పంపిణీ చేశారు. రెండు, మూడు నెలల పెన్షన్ మొత్తం ఒకేసారి అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News