Monday, January 20, 2025

ఖమ్మంలో ఉరేసుకున్న కుటుంబం…

- Advertisement -
- Advertisement -

పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో శుక్రవారం ఉదయం  విషాదం చోటుచేసుకుంది. మామిడితోటలో ఉరేసుకుని కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పోటు వెంకట కృష్ణారావు(40), సుహాసిని(35), అమృత(06)గా గుర్తించారు. ఆర్థిక సమస్యలతోనే కుటుంబం ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఖమ్మం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Also Read: కుక్కతో పాప బంతి ఆట… వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News