- Advertisement -
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి శివారులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్యాంకర్ లారీని లగ్జరీ ఆర్టిసి బస్సు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు ఆర్టీసీ బస్ కండక్టర్ వన్నపూరపు సీతారాం ప్రసాద్, కల్లూరు వాసిగా గుర్తించారు. కండక్టర్ ప్రసాద్ సత్తుపల్లిలో డ్యూటీ దిగి కల్లూరు బయలుదేరారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -