Monday, December 23, 2024

బిఆర్ఎస్ మేనిఫెస్టోకు జనం జేజేలు

- Advertisement -
- Advertisement -

67% మందిలో విశ్వాసం
గులాబీ పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తుందని 61% మంది అభిప్రాయం

మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టో ప్రకటించిన రాష్ట్రం లో ఆ పార్టీకి ప్రజాదరణ పెరిగినట్లు తెలంగాణ ఇంటెన్షన్ వీక్లీ సర్వేలో వెల్లడైంది. ఈ సంస్థ ప్రతీ ఆదివారం నివేదికను విడుదల చేస్తుండగా, తాజాగా విడదుల చేసిన వీక్లీ ట్రాకర్ సర్వేలో బిఆర్‌ఎస్ గ్రాఫ్ గణనీయంగా పెరిగినట్లు తేలింది. 67 శాతం మంది ప్రజలు బిఆర్‌ఎస్ మెనిఫెస్టోను విశ్వసిస్తున్నట్లు స ర్వే తేల్చింది. ఈ 67 శాతంలో 61 శాతం మంది ప్రజలు బిఆర్‌ఎస్‌కు ఓట్లు వేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. బిఆర్‌ఎస్ ప్రకటిచిన మెనిఫెస్టో మూడోసారి ఈ పార్టీని అధికారంలోకి తీసుకువస్తుందని 44 శాతం మంది ప్రజలు విశ్వసిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్‌ఎస్ పార్టీ గెలిచే అవకాశం 42 శాతం ఉండగా, కాం గ్రెస్ 32 శాతం, బిజెపి 10శాతం ఉన్న ట్లు తెలిపింది. అలాగే 9 శాతం హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, 7 శాతం మంది ప్రజలు ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నట్లు వీక్లీ ట్రాకర్ సర్వే పేర్కొంది.

అన్ని వర్గాల ప్రజలు పార్టీ వైపు మొగ్గు
సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ పార్టీ మూ డోసారి మ్యానిఫెస్టోను ప్రకటించిం ది. మిగిలిన రాజకీ య పార్టీల కన్నా ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన గులా బీ బాస్ తాజాగా సబ్బండవర్గాలకు మేలు చేసే విధంగా రూపొందించిన మ్యానిఫెస్టోకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. మహిళల కు భృతి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగిం పు…ఇలా అనేక పథకాల సమాహారంతో సి ఎం కెసిఆర్ ప్రకటించిన ఎన్నికల హామీ లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.గతంలోచెప్పినవే కాకుండా చెప్పనివి సైతం అమలు చేసి మానవీయ పాలనకు నిదర్శంగా నిలిచారు. అందరికీ మేలు చేసే విధంగా రూపొందించిన మ్యానిఫెస్టోను ప్రకటించడంతో అన్నివ ర్గాల ప్రజలు గులాబీవైపే మొగ్గుచూపుతున్నారు.

హ్యాట్రిక్ దిశగా అడుగులు
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ప్రజల అవసరాలను తీర్చేందుకు బిఆర్‌ఎస్ నడుం బిగించింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న వేళ.. మిగిలిన రాజకీయ పార్టీల కన్నా మిన్నగా ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించిన గు లాబీ అధినేత, అన్ని పార్టీల కంటే ముందుగానే మ్యానిఫెస్టోను ప్రకటించిన ప్రజల్లోకి వెళ్లారు. బిఆర్‌ఎస్ మెనిఫెస్టోలో సబ్బండవర్గాలకు మేలు చేసే హామీలు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తున్నది. ము ఖ్యంగా అభాగ్యులకు పింఛన్ల పెంపు సాహసోపేతమైన నిర్ణయంగా మేధావులు కీర్తిస్తున్నారు. అనాథ పిల్లలను ఆదుకునేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకు రాబోతుండడం బిఆర్‌ఎస్ మానవీయతకు అద్దం పడుతున్నది. మహిళలకు భృతి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు ఒకటేమిటి అనేకానేక పథకాల సమాహారంతో సిఎం కెసిఆర్ ప్రకటించిన ఎన్నికల హామీలు ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే చెప్పినవి చేసి, చెప్పనివి సైతం అమలు చేసి ప్రజలందరికీ ఎంతో మేలు చేసిన సీఎం కేసీఆర్ పరిపాలనను దేశ వ్యా ప్తంగా కీర్తిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి రావడం ద్వారా ప్రజలకు మరింత మేలు జరుగనున్నది. కేం ద్ర ప్రభు త్వం అమానవీయంగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచితే మళ్లీ అధికారం చేపట్టిన తర్వా త రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పడం బిఆర్‌ఎస్ పార్టీ గొప్పతనాన్ని చాటుకుంటున్నది. ఇక రైతుల మేలు కోసం పెట్టుబడి సాయాన్ని భారీగా పెంచడంతో వ్యవసాయం పండుగలా మారనున్నది. దళితబంధు, రైతు బీమా వంటి కీలకమైన పథకాలు కొనసాగింపు ఉంటుందని సిఎం కెసిఆర్ స్ప ష్టం చేశారు.

రైతుబీమా తరహాలోనే కెసిఆర్ బీమా …ప్రతి ఇంటికీ ధీమా పేరుతో రా ష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్ర తి పేద ఇంటికీ ఎల్‌ఐసి ద్వారా రూ.5 లక్షల జీవిత బీమా అందించబోతున్నారు. ఆరోగ్య శ్రీ గరిష్ఠ పరిమితి రూ.15లక్షలకు పెంచుతున్నట్లుగా మెనిఫెస్టోలో ప్రకటించారు. మూడోసారి అధికారంలోకి రాగానే ప్రస్తు తం కొనసాగుతున్న పథకాలను కొనసాగించడంతోపా టు కొత్త హామీలను ఆరు నెలల్లోనే అమలు చేస్తామని సిఎం కెసిఆర్ చెప్పడంతో అన్ని వర్గాల ప్రజలలో విశ్వా సం ఏ ర్పడి బిఆర్‌ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్న ట్లు తెలంగాణ ఇంటెన్షన్‌వీక్లీ సర్వే తేల్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News