- Advertisement -
హైదరాబాద్: కులవృత్తులను కెసిఆర్ ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మునుగోడులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి పర్యటిస్తున్నారు. మునుగోడు మండలం క్రిష్ణాపురం చెరువులో చేప పిల్లలను మంత్రులు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సిఎంగా కెసిఆర్ రావడం ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మత్స్యకారుల పరిస్థితి దారుణంగా ఉండేదని విమర్శించారు. ప్రస్తుతం మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని ప్రశంసించారు. ప్రజలే తన బంధువులు అని సిఎం కెసిఆర్ చెబుతుంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్‌సి బండ ప్రకాశ్ ముదిరాజ్ పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిజెపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం కార్యక్రమాలు చేపట్టారు.
- Advertisement -