Thursday, January 23, 2025

‘బూస్టర్’కు స్పందన కరవు

- Advertisement -
- Advertisement -

ఇప్పటివరకు ప్రికాషనరీ డోసు తీసుకున్న వారు 5% మాత్రమే

ఒకటి, రెండు డోసులకే ఆగిపోయిన మెజారిటీ ప్రజలు
వ్యాక్సిన్ అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవడంపై ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. పోటీ పడి మొదటి డోసు…రెండో డోసు తీసుకున్న వారు సైతం ప్రికాషరీ డోసు తీసుకోవడంపై వెనుకంజ వేస్తున్నారు. మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ తీవ్రత అంతగా లేకపోవడంతో అంతగా ఆసక్తి కనబరచడం లేదు. మె జారిటీ ప్రజలు ఒకటి, రెండు డోసులకే అగిపోయినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు కేవలం 5 శాతమే బూస్టర్ డోసు తీసుకున్నట్లు వైద్యారోగ్య తెలిపింది. రెండో డోసు వేసుకొని ఆరు నెలల సమ యం గడిచిన వారందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా బూస్ట ర్ డోసు ఇస్తున్నా ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఇదివరకు 60 ఏళ్లు దాటి న వారికి మాత్రమే బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతివ్వగా, ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి.. 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేవలం ప్రైవేటు అసుపత్రులకు అనుమతించింది.

బూస్టర్ డో సుపై అవగాహన ఉన్నవారు ప్రైవేట్‌లో డబ్బులు వెచ్చించి మూడో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్ర భుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా బూస్టర్ డోస్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది అర్హులు లబ్ధి పొందలేకపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు ఉచితంగా బూస్డర్ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుతివ్వ గా, రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రికాషనరీ డోసు వ్యాక్సిన్ ఇచ్చేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 2,77,67,000 మంది బూస్టర్ డోసు తీసుకునేందు కు అర్హులు ఉండగా, శనివారం నాటికి 14,69,858 మంది మాత్రమే తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

అవగాహన కల్పిస్తున్న ఆరోగ్య శాఖ

రాష్ట్రంలో అర్హులైన వారందరూ బూస్టర్ డోసు తీసుకునేలా వైద్యారోగ్య శాఖ అవగాహన కల్పిస్తోంది. మొదటి, రెండో డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా వేసుకుంటే కొవిడ్ వైరస్ నుంచి మరింత రక్షణ ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అర్హులైన వారందరూ తప్పనిసరిగా ప్రికాషనరీ డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండులలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే హౌసింగ్ సొసైటీలు, ఆఫీసులు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, ఇతర వర్క్ ప్లేసెస్‌లో వారి కోరిక మేరకు వ్యాక్సినేషన్ నిర్వహించడంతోపాటు 100 మంది కంటే ఎక్కువ మంది లబ్దిదారులు ఉన్న చోట వాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ఆరోగ్య శాఖ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News