Saturday, September 21, 2024

సిఎం కెసిఆర్ నిర్ణయాలతో ప్రజలు సేఫ్

- Advertisement -
- Advertisement -

CM KCR

 

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి కోసం సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు సేఫ్ జోన్‌లో ఉన్నారని తెలంగాణ ఉద్యోగుల జెఎసి చైర్మన్, కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డిలతో పాటు పలువురు ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం పెట్టిన కట్టుబాట్లు ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రజలు కూడా లాక్‌డౌన్‌కు పరిమితమై సురక్షితంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం ఇంటింటికీ సరుకులు, కూరగాయలు, పండ్లు ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టిన తర్వాత ప్రజలు రోడ్డు మీదకు రావలసిన అవసరం లేకుండా పోయిం దన్నారు. ఉద్యోగులు ప్రాణాలు ఫణంగా పెట్టి అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వం కొన్ని శాఖల ఉద్యో గులకు మాత్రమే ప్రోత్సాహాకాలు ప్రకటించినప్పటికీ మిగతా శాఖల ఉద్యోగులు వారికి సహకారంగా అందిస్తున్నారన్నారు.

జీతాలు ముఖ్యం కాదు ప్రజల జీవితాలు ముఖ్యమని ఉద్యోగులు అందిస్తున్న సేవలు ప్రజల అభిమానాన్ని చూరగొం టున్నాయన్నారు. లాక్‌డౌన్‌కు ఎలాంటి మినహాయింపులు లేకుండా పొడిగించాలని రాష్ట్ర ఉద్యోగుల జెఎసి తరుపున ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన జోన్లల్లో ఆంక్షలు ఎత్తివేస్తే మళ్లీ కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, లాక్‌డౌన్ యథాతథంగా కొనసాగిస్తూనే కరోనాకు అడ్డుకట్ట వేయగలమని, దీనికి ఉద్యోగ వర్గాలు, ప్రజలు పూర్తిగా సహకరిస్తారని వారు పేర్కొన్నారు. అన్ని జిల్లాలో టిఎన్జీఓలు, టిజిఓలు ఇతర ఉద్యోగసంఘాల పక్షాన నిత్యావసర సరుకుల పంపిణీ, మాస్కులు, శానిటైజర్‌లు, చేతి గ్ల్లైవ్స్, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

టిఎన్జీఓ ప్రధానకార్యదర్శి మామిళ్ల రాజేందర్, టిజిఓ ప్రధాన కార్యదర్శి ఎనుగుల సత్యనారాయణ, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్, నాల్గవ తరగతి ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఖాదర్, జెయల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. మధుసూదన్ రెడ్డి, టిటియూ అధ్యక్షుడు మునగాల మణిపాల్ రెడ్డి , టియూటిఎఫ్ అధ్యక్షుడు మల్లారెడ్డి, టిఎన్జీఓ రాష్ట్ర సహ అధ్యక్షురాలు బి. రేచల్, గ్రూప్ 1 అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతనాయక్ తదితరులు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

 

People are safe with CM KCR decisions
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News