Wednesday, January 22, 2025

బాలుడిని మింగిందని…. మొసలి కడుపు కోయబోయారు

- Advertisement -
- Advertisement -

People attack on crocodile

భోపాల్: బాలుడిని మొసలి మింగిందనే అనుమానంతో గ్రామ ప్రజలు దానిని చిత్రహింసలకు గురి చేసిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం ష్యోపూర్ జిల్లా రిఝాంట గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సోమవారం అతర్ సింగ్ అనే బాలుడు స్నానం కోసం చంబల్ నదిలోకి దిగాడు. బాలుడు కనిపించకపోవడంతో మొసలి మింగిందని గ్రామప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. పెద్ద వల తీసుకొచ్చి మొసలిని బయటకు లాగారు. మొసలిపై దాడి చేయడమే కాకుండా బాలుడు దాని కడుపులో ఉన్నాడని ఆక్సిజన్ అందడానికి పెద్ద కర్ర దాని నోట్లో పెట్టి హింసించారు. మొసలి కడుపు కోసి బాలుడిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా స్థానికుల సమాచారం మేరకు అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని మొసలిని స్వాధీనం చేసుకుని నదిలో వదిలేశారు. నదిలో గాలించగా బాలుడు శవం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News