ప్రజలకు చట్టాలపై అవగహన కల్గి ఉండాలి
మెట్‌పల్లి జూనియర్ సివిల్ జడ్జి పద్మావతి
మనతెలంగాణ/మల్లాపూర్: ప్రపంచ న్యాయ సేవా దినోత్సవంను పురస్కరించుకొని మల్లాపూర్ గ్రామపంచాయితీ ఆవరణలో న్యాయ చట్టాలపై ప్రజలకు అవగహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్‌పల్లి జూనియర్ సివిల్ జడ్జి సద్మావతి మాట్లాడారు. ప్రజలు చట్టాలపై అవగహన కల్గి ఉండడంతో పాటు చట్టాలను ఉపయోగించుకోవాలని అన్నారు. న్యాయ చట్టాన్ని ఎవరి చేతులోకి తీసుకోకూడదన్నారు. పలు చట్టాలపై అవగహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా, నేరాలకు దూరంగా ఉండాలంటూ, చట్ట పరిధిలో నడుచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోషియోషన్ అధ్యక్షుడు యండి వలీయోద్దిన్, సెక్రటరీ తెడ్డు ఆనంద్, ఎజిపి సురక్ష, సీనియర్ న్యాయవాదులు ఏలేటి రాంరెడ్డి, వేంకటస్వామి, దయాకర్‌వర్మ, రాజేందర్, తహసీల్దార్ తోట రవిందర్, ఎస్‌ఐ రాజేందర్, జడ్పిటిసి సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిటిసిలు సత్తమ్మ, ఆకుతోట రాజేష్, ప్రజా ప్రతినిధులు కాటిపెల్లి ఆదిరెడ్డి, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు,