Thursday, December 26, 2024

కెసిఆర్ ముఖ్యమంత్రిగా లేరని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నరు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ ముఖ్యమంత్రిగా లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని జిల్లాల నేతలు చెబుతున్నారని కెటిఆర్ అన్నారు. సరిగ్గా నెల రోజుల కిందట డిసెంబర్ 3న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే అని, నెల రోజుల్లోనే తమ శ్రేయోభిలాషులు, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు తాము నియోజకవర్గాలకు, జిల్లాలకు వెళ్లినప్పుడు కానీ, తెలంగాణ భవన్‌లోని వివిధ సందర్భాల్లో కలిసిన సమయంలో చాలా విషయాలు చెబుతూ వచ్చారని అన్నారు.

పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు ఆదిలాబాద్ నుంచి ప్రారంభించామని, సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో తమ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా, కుండబద్దలు కొట్టినట్లుగా, నిర్మొహమాటంగా మా అందరి దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. బిఆర్‌ఎస్ ఓడిపోతది అనుకోలేదు… కెసిఆర్ సిఎంగా దిగిపోతరనే మాట అస్సలు అనుకోలేదని గ్రామాల్లో అనుకుంటున్నరని చెప్పారని పేర్కొన్నారు. ఒకవేళ ఓడిపోతే తమ ఎంఎల్‌ఎ ఓడిపోతడేమో కానీ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండడు అని తాము కలలో కూడా అనుకోలేదు అని అంటున్నట్ల తమ కార్యకర్తలు చెబుతున్నారని, అయ్యయ్యో గిట్లెట్ల జరిగిందనే భావన ప్రజల్లో ఉన్నదని తెలిపారు. ప్రతి గ్రామంలో జరుగుతున్న చర్చని తమ పార్టీ నేతలు, కార్యకర్తలు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News